ఉపమాలంకారం

ఒక రకమైన అర్థాలంకారం

ఉపమాలంకారం ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన సాదృశాన్ని చెప్పే అలంకారం లేదా ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చడం. ఇది అర్థాలంకారాల్లో ఒకటి. ఉపమాలంకారము అన్ని అర్థాలంకారాలలోకి ఎక్కువ ఉపయోగించబడుతున్నది. దీనిని ఆంగ్లంలో simile (en) అంటారు.[1]

లక్షణంమార్చు

లక్షణం: ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః

వివరణ: ఉపమానానికి, ఉపమేయానికి సామ్యరూపమైన సౌదర్యాన్ని చెప్పడం "ఉపమా" అలంకారం అవుతుంది.

సాంకేతిక పదాలుమార్చు

ఉపమాలంకారాన్ని అర్థంచేసుకునేందుకు ఉపకరించే సాంకేతిక పదాలు, వాటి అర్థాలు ఇవి:;[2] ఉపమానం : దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం

ఉపమేయం : దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం
సమానధర్మం : ఉపమానానికి, ఉపమేయానికి మధ్యనున్న పోలిక
ఉపమావాచకం : ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చడానికి వాడే పదం

ఉదాహరణమార్చు

రఘువంశంలో కాళిదాసు రాసిన శ్లోకం క్రిందనీయబడినది.

వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థప్రతిపత్తయే

జగతఃపితరౌ వందే, పార్వతీపరమేశ్వరౌ ||

ఈ శ్లోకంలో ఉపమాలంకారం ఉపయోగించబడినది. ఈ శ్లోకం అర్థం : పదాలను (వాక్కులు), అర్థాలను నాకు ప్రసాదించమని - వాక్కు, అర్థం వలె కలిసి ఉండే పార్వతీపరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను.

ఇందులో

ఉపమేయం: పార్వతీపరమేశ్వరులు

ఉపమానం: వాక్కు, అర్థం

సమానధర్మం: కలిసి ఉండటం.

ఉపమావాచకం: ఇవ (సంస్కృతంలో), వలె ( తెలుగు అనువాదంలో)

ఇక్కడ వాగర్థాలకు, పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగే ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం.

ఈ నాలుగు వస్తువులూ ఉన్న ఉపమాలంకారాన్ని పూర్ణోపమాలంకారం అంటాము. కొన్ని సందర్భాలలో వీటిలో కొన్నే ఉండవచ్చును. అప్పుడు దాన్ని లుప్తోపమాలంకారము అంటాము. లుప్తోపమాలంకారములను మనం చలనచిత్ర గీతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.

ఉదాహరణలుమార్చు

పూర్ణోపమాలంకారము

  • ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది ఇక్కడ వలె అనునది ఉపమావాచకం. ముఖము ఉపమేయం. చంద్రబింబం ఉపమానం.
  • ఆమె కన్నులు కలువ రేకుల వలెనున్నవి

లుప్తోపమాలంకారము

ఆమె చిగురుంకేలు నంటుకొంటివి.

చిగురువలె మెత్తని, కేలు (చేయి అని అర్థము) ఇందులో​వలె, అను ఉపమావాచకము లేదు. మెత్తని అను సమానధర్మము లేదు. చిగురు అను ఉపమానము, కేలు అను ఉపమేయము. ఈ రెండే కలవు

మూలాలుమార్చు

  1. "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/అలంకార విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-18.
  2. పి., సందీప్ (11 జూలై 2010). "ఉపమాలంకారము (Simile)". మనోనేత్రం. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 22 October 2015.
🔥 Top keywords: ఈనాడుతెలుగుశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివాతావరణంఅదితిరావు హైదరీసెక్స్ (అయోమయ నివృత్తి)తీహార్ జైలుమొదటి పేజీరామ్ చ​రణ్ తేజవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపోసాని కృష్ణ మురళిసిద్ధార్థ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రత్యేక:అన్వేషణతెలుగు అక్షరాలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డివికీపీడియా:Contact usయూట్యూబ్బ్రెజిల్ఈజిప్టుమెరుపుయునైటెడ్ కింగ్‌డమ్వనపర్తి సంస్థానంభారతదేశంలో కోడి పందాలుచైనాగుడ్ ఫ్రైడేఊర్వశిబుడి ముత్యాల నాయుడునక్షత్రం (జ్యోతిషం)నికరాగ్వాఓం భీమ్ బుష్తెలుగు సినిమాలు 2024సుమేరు నాగరికతలిబియాతిలక్ వర్మచెల్లమెల్ల సుగుణ కుమారిచెక్ రిపబ్లిక్రాశిమియా ఖలీఫాజానంపల్లి రామేశ్వరరావుసామెతల జాబితారావుల శ్రీధర్ రెడ్డితెలంగాణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగుదేశం పార్టీఇండియన్ ప్రీమియర్ లీగ్భగవద్గీతమీనాసన్ రైజర్స్ హైదరాబాద్రోహిత్ శర్మరామాయణంప్రపంచ రంగస్థల దినోత్సవంహోళీఉగాదిచంద్రయాన్-3ఎనుముల రేవంత్ రెడ్డిఆంధ్రప్రదేశ్పన్ను (ఆర్థిక వ్యవస్థ)గాయత్రీ మంత్రంమహేంద్రసింగ్ ధోనిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసురేఖా వాణిజూనియర్ ఎన్.టి.ఆర్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాగుణింతంగోత్రాలు జాబితాఅరుణాచలంప్రత్యేక:ఇటీవలిమార్పులుప్రేమలుహార్దిక్ పాండ్యాబి.ఆర్. అంబేద్కర్ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాయేసుహైన్రిక్ క్లాసెన్హనుమాన్ చాలీసాభారత రాజ్యాంగంబంగారంకిలారి ఆనంద్ పాల్వేంకటేశ్వరుడుతెలుగు సంవత్సరాలుకల్వకుంట్ల కవితమహాభారతంG20 2023 ఇండియా సమిట్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమార్చి 28అంగుళంభీమా నదిశక్తిపీఠాలుమహాత్మా గాంధీపొడుపు కథలుఊరు పేరు భైరవకోననారా చంద్రబాబునాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకిరణ్ రావువై.యస్. రాజశేఖరరెడ్డి